హీరో మాధవన్‌ తనయుడు వేదాంత్‌ అరుదైన ఘనత, 7 జాతీయ పథకాలు

హీరో మాధవన్ కుమారుడు వేదాంత్‌ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 16 ఏళ్ల వేదాంత్ 7 జాతీయ అవార్డులను గెలిచి అరుదైన ఘనత సాధించాడు.

హీరో మాధవన్‌ తనయుడు వేదాంత్‌ అరుదైన ఘనత, 7 జాతీయ పథకాలు

తన కృషితో కుటుంబంతో పాటు దేశం పేరును మరోసారి వెలుగులోకి తీసుకొచ్చాడు వేదాంత్‌. ఇటీవల ముగిసిన 47వ జూనియర్ నేషనల్ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్స్ 2021లో మొత్తం ఏడు పతకాలను గెలుచుకున్నాడు. అతి చిన్న వయసులోనే వేదాంత్‌ సాధించిన ఘనతను ప్రశంసిస్తూ రాజ్యసభ సభ్యుడు అభిషేక్‌ మను సింఘ్వీ ఓ ట్వీట్‌ చేశారు.

మాధవన్‌, వేదాంత్‌లు కలిసి ఉన్న ఫొటోను ట్వీట్‌ చేస్తూ ‘గుడ్‌ జాబ్‌ వేదాంత్‌. నువ్వు దేశం గర్వించేలా చేశావు.

నిన్ను చూసి గర్వపడుతున్నాం. అలాగే నీ పెంపకం చూసి కూడా’ అంటూ ఈ సందర్భంగ తండ్రి మాధవన్‌పై కూడా ప్రశంసలు కురిపించారు. కాగా బెంగళూరు వేదికగా బసవనగుడి ఆక్వాటిక్ సెంటర్‌లో జరిగిన ఈ పోటీలో వేదాంత్‌ నాలుగు రజత పతకాలతో పాటు మూడు కాంస్య పతకాలు సాధించాడు. ఈ పోటీలో వేదాంత్‌ మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో 800 మీటర్ల ఫ్రీస్టైల్ స్విమ్మింగ్, 1500 ఫ్రీస్టైల్ స్విమ్మింగ్, 4×100 ఫ్రీస్టైల్ రిలే, 4×200 ఫ్రీస్టైల్ రిలే ఈవెంట్లలో రజత పథకాలు గెలుచుకున్నాడు.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *