ట్రెండింగ్‌లో నాలుగేళ్ల చిన్నారి.. ఏం చేశాడంటే

ప్రస్తుతం ఈ కోవకు చెందిన వీడియో ఒకటి సోషల్‌​ మీడియాలో తెగ వైరలవుతోంది. నాలుగేళ్ల కుర్రాడు.. రక్షణ విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని చూసి.. వారికి సెల్యూట్‌ చేస్తాడు. ప్రతిగా వారు చిన్నారికి అభివాదం చేస్తారు. ఈ వీడియో చూసిన నెటిజనులు చిన్నారి దేశభక్తిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ వివరాలు..

ట్రెండింగ్‌లో నాలుగేళ్ల చిన్నారి.. ఏం చేశాడంటే

ఈ సంఘటన కర్ణాటక, బెంగళూరు విమానాశ్రయంలో చోటు చేసుకుంది. దీనిలో నాలుగెళ్ల చిన్నారి వీర్‌ అర్జున్‌ తండ్రి చేయి పట్టుకుని నడుచుకుంటూ విమానాశ్రయం లోపలకి వెళ్తుంటాడు. ఆ సమయంలో వీర్‌కు ఎదురుగా సెంట్రల్‌ ఇండస్ట్రీయల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(సీఐఎస్‌ఎఫ్‌) జవాన్లు తన విధులకు హాజరయ్యేందుకు వాహనంలో వస్తుంటారు. వారిని గమనించిన వీర్‌.. తండ్రి చేయి వదిలిపెట్టి.. సీఐఎస్‌ఎఫ్‌ వాహనానికి ఎదురుగా నిలబడి.. వారికి సెల్యూట్‌ చేస్తాడు.

వీర్‌ని గమనించిన సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది ప్రతిగా సెల్యూట్‌ చేస్తాడు. ఇందుకు సంబంధించిన వీడియోని వీర్‌ తండ్రి తొలుత ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ఇది చూసిన నెటిజనులు వీర్‌పై ప్రశంసలు కురిపించసాగారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఈ వీడియోని రీ పోస్ట్‌ చేస్తూ.. ‘‘గౌరవం, దేశభక్తి వంటి అంశాలను బాల్యంలోనే నేర్పించాలి’’ అంటూ వీర్‌పై ప్రశంసలు కురిపించడంతో ఇది మరోసారి వైరలయ్యింది. ఇప్పటికే ఈ వీడియో ని 4 లక్షల మందికిపైగా లైక్‌ చేశారు.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *