Saturday November 17, 2018
12 పాయింట్లు దాటితే ఏడాది వరకూ నిషేధం ! - Tollybeats

12 పాయింట్లు దాటితే ఏడాది వరకూ నిషేధం !

Updated | January 11, 2018 12:39 IST

హైద‌రాబాద్‌: ఇష్టానుసారంగా వాహనాలు నడిపేవారికి బ్రేకులు పడనున్నాయి! హెల్మెట్‌ పెట్టుకోకపోవడం, కూడళ్లలో సూచికలను పాటించకపోవడం తదితర నిబంధనల ఉల్లంఘనలకు గత ఆగస్టు నుంచి పోలీసులు అపరాధ సంఖ్యలను (పాయింట్లు) ఇస్తున్నారు. తొలిసారిగా, 12 పాయింట్లు దాటిన ఓ వాహనదారుడి చోదక లైసెన్సు ఏడాదిపాటు రద్దు కానుంది. ఆ గడువులోగా మళ్లీ వాహనం నడిపితే సదరు వ్యక్తి జైలుకు వెళ్లక తప్పదు!

హైదరాబాద్‌లో దాదాపు 350 మంది ట్రాఫిక్‌ పోలీసులు... నిబంధనల ఉల్లంఘించే వాహనదారులను రోజూ గుర్తించి, ఆన్‌లైన్‌ ద్వారా వారి ఖాతాల్లో పాయింట్లు వేస్తున్నారు. 13వ పాయింటు నమోదుకాగానే లైసెన్సు రద్దయ్యేలా ఏర్పాట్లుచేశారు. ఒకసారి లైసెన్సు రద్దయ్యాక... మళ్లీ వాహనం నడిపితే నెల రోజులకుపైగా జైలుశిక్ష విధించే అవకాశముందని ట్రాఫిక్‌ డీసీపీ ఏవీ రంగనాథ్‌ చెప్పారు.

SHARE