Saturday November 17, 2018
వ‌ర్మ‌ మళ్లీ మాట తప్పాడు!! - Tollybeats

వ‌ర్మ‌ మళ్లీ మాట తప్పాడు!!

Updated | December 26, 2017 16:45 IST

వివాదాల ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ ఇటీవ‌లి కాలంలో సినిమాల కంటే ఇత‌ర విష‌యాల ద్వారానే ఎక్కువ‌గా వార్త‌ల్లో నిలుస్తున్నాడు. ఇటీవ‌లి కాలంలో ఆయ‌న సినిమాలేవీ ప్ర‌జాద‌ర‌ణ పొంద‌లేదు.అలాంటి టైమ్‌లో నాగార్జున ఓ సినిమా చేసే అవ‌కాశం ఇచ్చాడు. మంచి ఫామ్‌లో ఉన్న నాగార్జున మ‌రోసారి వ‌ర్మను న‌మ్మాడు.

దీంతో ఆ సినిమాను వ‌ర్మ సీరియ‌స్‌గా తీసుకున్నాడు. నాగ్ సినిమా పూర్త‌యిపోయేవ‌ర‌కు వేరే విష‌యాల గురించి ఆలోచించ‌న‌ని ప్ర‌క‌టించాడు. అయితే నాగ్ త‌న త‌న‌యుడు అఖిల్ `హ‌లో` సినిమాతో బిజీగా ఉండ‌డంతో వ‌ర్మ మ‌ళ్లీ వివాదాల‌పై దృష్టిపెట్టాడు. క‌డ‌ప‌ ఫ్యాక్షనిస్టుల నేప‌థ్యంతో వెబ్ సిరీస్ మొద‌లెట్టాడు. ఇటీవ‌లే ట్రైల‌ర్ కూడా విడుద‌లైంది. దీంతో వ‌ర్మ మ‌రోసారి వివాదాల్లో చిక్కుకున్నాడు.

దీంతో నాగ్ సినిమా ప్రారంభోత్స‌వ స‌మ‌యంలో ఇచ్చిన మాట‌ను వ‌ర్మ త‌ప్పాడ‌ని గుస‌గుస‌లు విన‌బ‌డుతున్నాయి. తెలుగులో సినిమాలే చేయనని ప్రకటించిన వర్మ ఆ తర్వాత సినిమాలు చేసి మాట తప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ నాగార్జునకు ఇచ్చిన మాట కూడా తప్పి తాను మాటమీద నిలబడే మనిషిని కాదని మరోసారి నిరూపించుకున్నాడు.

SHARE