Sunday January 21, 2018
రజనీ చివరి సినిమా !! - Tollybeats

రజనీ చివరి సినిమా !!

Updated | January 10, 2018 17:52 IST

చెన్నై: సొంతంగా రాజకీయ పార్టీని స్థాపిస్తానని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన తెలిపారు. అయితే రాజకీయ ప్రవేశం తర్వాత సినిమాలకు దూరంగా ఉండాలని రజనీ భావిస్తున్నారట. ప్రస్తుతం ఆయన ‘కాలా’ సినిమాలో నటిస్తున్నారు. పా రంజిత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాదిలో సినిమా విడుదల కాబోతోంది. నిజానికి దీని తర్వాత తలైవా మరో సినిమాలో నటించరని వార్తలు వచ్చాయి.

అయితే రాజకీయ నేపథ్యంలో ఓ ప్రభావవంతమైన సినిమా తీసి.. ఆ తర్వాత సినీ కెరీర్‌కు స్వస్తి చెప్పాలని ఆయన భావిస్తున్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం.ఈ మేరకు మరో కొత్త ప్రాజెక్టుకు రజనీ ఓకే చెప్పారట. దీనికి కూడా పా రంజిత్‌ దర్శకత్వం వహించనున్నారట.

ఈ సినిమా రజనీ సినీ కెరీర్‌కు సరైన వీడ్కోలని చెబుతున్నారు. రాజకీయ నేపథ్యంలో సినిమా చేయాలన్నది రజనీ ఆలోచనేనని తెలుస్తోంది. ఈ సినిమాతో రజనీ అభిమానులకు, ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని ఇచ్చే దిశలో స్క్రిప్‌ను సిద్ధం చేస్తున్నారట.

SHARE