Friday April 20, 2018
సుల్తాన్ రీమేక్ లో వెంకటేష్? - Tollybeats

సుల్తాన్ రీమేక్ లో వెంకటేష్?

Updated | September 27, 2017 13:06 IST

రీమేక్‌ కథలంటే ఎక్కువ మక్కువ చూపిస్తుంటారు వెంకటేష్‌. ఆయన కెరీర్‌లో విజయవంతమైన చిత్రాల జాబితాలో రీమేక్‌ కథలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈమధ్య ఆయన్నుంచి వచ్చిన ‘దృశ్యం’, ‘గురు’లూ రీమేక్‌లే. మరోసారి ఆయన పరభాషా చిత్రంపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది.

బాలీ వుడ్‌లో ఘన విజయం సాధించి,రికార్డుల దుమ్ము దులిపిన చిత్రం ‘సుల్తాన్‌’. ఈ చిత్రాన్ని దక్షిణాదిన మిగిలిన భాషల్లోనూ పునః నిర్మించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే తమిళ హక్కుల్ని భారీ ధరకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. తెలుగులోనూ పునః నిర్మించే సన్నాహాలు మొదలైనట్టు తెలుస్తోంది. తెలుగులో వెంకటేష్‌ నటించే అవకాశాలున్నాయని సమాచారం. సల్మాన్‌, వెంకీ మంచి మిత్రులు. ఇది వరకు సల్మాన్‌ నటించిన ‘బాడీగార్డ్‌’ని తెలుగులో వెంకీనే రీమేక్‌ చేశారు. ఈసారి ఏం జరుగుతుందో చూడాలి.

SHARE