Thursday January 18, 2018
వంట గ్యాస్ ధరల పెంపు నిర్ణయాన్ని వెనుకకు తీసుకుంది! - Tollybeats

వంట గ్యాస్ ధరల పెంపు నిర్ణయాన్ని వెనుకకు తీసుకుంది!

Updated | December 29, 2017 13:04 IST

న్యూఢిల్లీ : వంట గ్యాస్ సిలిండర్ ధరను ప్రతి నెలా రూ.4 చొప్పున పెంచాలన్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. పేదలకు ఉచితంగా వంట గ్యాస్ కనెక్షన్లను ఇచ్చే ఉజ్వల పథకానికి ప్రతికూలత ఏర్పడకూడదనే ఉద్దేశంతో ప్రతి నెలా ధరల పెంపు నిర్ణయాన్ని వెనుకకు తీసుకుంది.

వంట గ్యాస్‌కు రాయితీని పూర్తిగా తొలగించే ఉద్దేశంతో 2016 జూన్ నుంచి ప్రతి నెలా ఒక్కొక్క సిలిండర్‌కు రూ.4 చొప్పున పెంచాలని గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలను అక్టోబరులో ఉపసంహరించుకున్నట్లు ప్రబుత్వ వర్గాలు తెలిపాయి. దీని ఫలితంగానే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ అక్టోబరు నుంచి వంట గ్యాస్ ధరలను పెంచడం లేదు.

SHARE