Sunday January 21, 2018
రూటు మార్చిన సునీల్!! - Tollybeats

రూటు మార్చిన సునీల్!!

Updated | December 27, 2017 13:28 IST

తెలుగునాట కమెడియన్స్‌గా సక్సెస్ సాధించిన వారెందరో ఆ తర్వాత హీరోలుగానూ అదృష్టం పరీక్షించుకున్నారు. సునీల్ కూడా హీరోగా మెప్పించేందుకు ఎంతగానో కష్టపడ్డాడు. అయితే హీరోగా మారాక కమెడియన్ రోల్స్‌కు టాటా చెప్పాడు సునీల్. కానీ కాలం కలసిరాక కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించకపోవడంతో ఇప్పుడు తిరిగి కమెడియన్‌గా రీఎంట్రీ ఇస్తున్నాడట సునీల్.

ఆ మధ్య కండలు పెంచి సిక్స్ ప్యాక్‌లో కనిపించిన సునీల్ ఇప్పుడు కమెడియన్‌గా నవ్వులు పెంచేందుకు మునుపటిలా బొద్దుగా మారాడు. సునీల్ రీఎంట్రీ నిర్ణయాన్ని స్వాగతించిన దర్శకులు ఈ కామెడీ స్టార్ కోసం స్పెషల్ రోల్స్ క్రియేట్ చేస్తున్నారట. ఇప్పటికే చిరంజీవి సినిమా 'సైరా నరసింహారెడ్డి'తో పాటు ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ తెరకెక్కించే చిత్రంలో కామెడీ రోల్‌కు కమిట్ అయిన సునీల్ తాజాగా మరో సినిమాకు అంగీకరించినట్టు తెలుస్తోంది.

రవితేజ-శ్రీనువైట్ల కాంబినేషన్‌లో తెరకెక్కబోయే చిత్రంలోనూ సునీల్ కామెడీ పంచబోతున్నాడట. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుగుతోన్న ఈ సినిమాలో సునీల్ కోసం ఓ స్పెషల్‌రోల్ సిద్ధం చేశాడట శ్రీనువైట్ల. గతంలో శ్రీనువైట్ల డైరెక్షన్‌లో వచ్చిన 'ఢీ', 'రెడీ', 'అందరివాడు', 'దుబాయ్ శీను' వంటి చిత్రాల్లో సూపర్బ్‌గా నవ్వులు పంచాడు సునీల్. మరి.. ఈ కాంబినేషన్ ఈ సారి ఏ రీతిన నవ్విస్తుందో చూడాలి.

SHARE