Tuesday October 23, 2018
రజనీకి గా మద్దతు మరో హీరో.. - Tollybeats

రజనీకి గా మద్దతు మరో హీరో..

Updated | January 4, 2018 14:11 IST

చెన్నై: రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన సినీ నటుడు రజనీకాంత్‌కు చిత్ర పరిశ్రమ నుంచి మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే సినీ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్‌ రజనీకాంత్‌కు మద్దతు పలికారు. రజనీకాంత్‌ పార్టీలో రాఘవ లారెన్స్‌ చేరే అవకాశముందని తెలుస్తోంది. ఇక తమిళ చిత్రపరిశ్రమలో కీలక హీరోగా ఉన్న తెలుగు వ్యక్తి విశాల్‌ సైతం తాజాగా రజనీకాంత్‌ మద్దతు పలికారు. రజనీకాంత్‌ కోసం ఓ కార్యకర్తగా పనిచేస్తానని, రజనీ తరఫున 234 స్థానాల్లో ప్రచారం చేస్తానని విశాల్‌ తెలిపారు. రాజకీయాలంటే సేవ చేయడమేనని విశాల్‌ పేర్కొన్నారు.

 

SHARE