Friday April 20, 2018
భాజపాతో కలిసి పనిచేస్తా ..కమల్ - Tollybeats

భాజపాతో కలిసి పనిచేస్తా ..కమల్

Updated | September 27, 2017 12:45 IST

చెన్నై: ప్రముఖ సినీనటుడు కమల్‌హాసన్‌ తన రాజకీయ ఆరంగేట్రంపై ఇప్పటికే ఓ స్పష్టత ఇచ్చేశారు. సొంతగా ఓ పార్టీని పెట్టుబోతున్నట్టు ఆయన ప్రకటించారు. దీంతో తమ అభిమాన నటుడు పెట్టబోయే పార్టీకి ఏం పేరు పెడతారు? ఎవరితో కలిసి పనిచేస్తారు? ఎలాంటి ఎజెండాతో ప్రజల ముందుకు వస్తారు? పార్టీని ఎప్పుడు ప్రకటిస్తారు? అనే అంశాలపై అభిమానుల్లో చర్చ వూపందుకొంది.

ఈ పరిస్థితుల్లో ఆయన మంగళవారం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు. రాజకీయాల్లో అస్పృశ్యత ఉండదన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం భాజపాతోనైనా కలిసి పనిచేసేందుకు తాను సిద్ధమని స్పష్టం చేశారు. భాజపా సిద్ధాంతాలతో తన భావజాలానికి ఎలాంటి సారూప్యత లేనప్పటికీ.. సంక్షేమం, పరిపాలన అంశాలకు అది అడ్డుకాదని అభిప్రాయపడ్డారు.

రాజకీయ ప్రవేశంపై ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చిన కమల్‌ తన పార్టీ పేరు, గుర్తు, జెండా తదితర అంశాలపై కసరత్తు చేస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి పార్టీ పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

SHARE