Monday June 18, 2018
బైరెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నడా..? - Tollybeats

బైరెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నడా..?

Updated | September 11, 2017 08:35 IST

తెలుగుదేశం పార్టీలో ఓ వెలుగువెలిగి రాయలసీమ పరిరక్షణ సమితి (ఆర్ పీఎస్)పేరుతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని మొదలుపెట్టి....ఐదేళ్ల పాటు నడిపిన తర్వాత ఆ వేదికను నడిపిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తన పోరాటానికి స్వస్తి పలికాడు. దీనికి స్వస్తి పలికిన తరువాత బై రెడ్డి చూపు తెలుగుదేశం పార్టి వైపు మల్లిందని.. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని వార్తలు వచ్చాయి. కాని, అందులో నిజం లేదని తేలిపోయింది.  బైరెడ్డి తెలుగుదేశం పార్టీలో కాని, ఇటు వైకాపాలో కాని చేరడం లేదట. మరి ఏ పార్టీలో చేరుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ లో కూనారిపోయే దశలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో బైరెడ్డి చేరుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.  

1994 లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన బైరెడ్డి పదేళ్ళ పటు ఎమ్మెల్యేగా ఉన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఆయన పార్టి నుంచి బయటకు వచ్చి రాయలసీమ కోసం ఉద్యమాన్ని చేపట్టారు.రాయలసీమ పరిరక్షణ సమితి పేరుతో ఉద్యమం చేశారు.  నంద్యాల ఉపఎన్నికల్లో ఆర్ పీఎస్ అభ్యర్ధికి కేవలం 154 ఓట్లు మాత్రమె రావడంతో.. ఆయన ఆర్ పీఎస్ కు స్వస్తి పలికారు.  కాగ, తాజాగా వెలువడుతున్న సమాచారం ప్రకారం బైరెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నారట.ఇంకా ఆసక్తికరమైన పరిణామం ఏమిటంటే...ఆయన్ను కాంగ్రెస్ గూటికి చేరుస్తున్నది మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. తాను సైతం కాంగ్రెస్లో చేరాలని డిసైడైన కిరణ్ కుమార్ రెడ్డి ఈ  క్రమంలో బైరెడ్డిని సైతం కాంగ్రెస్ గూటికి చేరుస్తున్నారట. మరి ఈ ఇద్దరి చేరికతో కాంగ్రెస్ పార్టీ బలం పెరుగుతుందా లేదా చూద్దాం.  

 

 

SHARE