Saturday November 17, 2018
బుద్వేల్ ప్రాంతంలో కొత్త ఐటీ సముదాయం - Tollybeats

బుద్వేల్ ప్రాంతంలో కొత్త ఐటీ సముదాయం

Updated | January 4, 2018 13:10 IST

హైదరాబాద్‌: ఐటీ రంగానికి ఊతమిచ్చేలా రాజధాని శివారు బుద్వేలులో కొత్త ఐటీ సముదాయాన్ని (క్లస్టర్‌) ఏర్పాటుచేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. ఇందుకు సన్నాహాలు ప్రారంభించింది. రాష్ట్రావతరణ తర్వాత స్థాపిస్తున్న తొలి సముదాయమిది. పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి కేటీఆర్‌ బుధవారం ఈ ప్రాంతాన్ని పరిశీలించి, అనుకూలంగా ఉన్న 350 ఎకరాలను గుర్తించారు. ఈ క్లస్టర్‌కు వచ్చేనెలలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు. ఇక్కడ 30కి పైగా సంస్థలు పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి. ఐదేళ్లలో వీటి ద్వారా 1.25 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా.

పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌, ఐటీ, రెవెన్యూశాఖల అధికారులతో కలిసి కేటీఆర్‌ రాజేంద్రనగర్‌, బుద్వేలును సందర్శించారు. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం సమూహం ఏర్పాటుకు అనువైన ప్రాంతాన్ని పరిశీలించి, పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

SHARE