Saturday November 17, 2018
బీజేపీ ప్లాన్ సి సిద్ధం చేసింది.. - Tollybeats

బీజేపీ ప్లాన్ సి సిద్ధం చేసింది..

Updated | September 6, 2017 12:18 IST

తెలంగాణలో బలోపేతం అవ్వాలనుకుంటున్న బీజేపీ ప్రధానంగా రాష్ట్రంలోని రెడ్డి సామాజికవర్గ నేతలపై గురిపెట్టింది. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, టీడీపీ-టీఎస్‌ రెడ్డి నేతలను కమలం వైపు ఆకర్షించే పనులను ముమ్మరంగా కొనసాగిస్తోంది. ముఖ్యంగా కాంగ్రె్‌సలోని రెడ్డి సామాజికవర్గానికి చెందిన పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను చేర్చుకోవటంపై దృష్టి పెట్టింది. తెలంగాణలో కాంగ్రెస్‌ ఆయువుపట్టు రెడ్డి సామాజికవర్గమేనని బీజేపీ అగ్రనేతలు గుర్తించారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఆ సామాజికవర్గం కాంగ్రెస్‌ వెంటే ఉందని, టీడీపీ ఆవిర్భావం తర్వాత కూడా రెడ్డి నేతలు కాంగ్రెస్‌ వెన్నంటే ఉన్నారని గమనించారు.
  
రెడ్డి సామాజికవర్గం బలాన్ని కేసీఆర్‌ బాగా గుర్తించారని, అందుకే కేబినెట్‌లో రెడ్డి సామాజిక వర్గానికి పెద్దపీట వేశారని బీజేపీ విశ్వసిస్తోంది. జగిత్యాల కాంగ్రెస్‌ నేత, నిజామాబాద్‌ మాజీ ఎమ్మెల్యే, నల్గొండకు చెందిన రెడ్డి సోదరులతో చర్చల తంతుకూడా ముగిసినట్లు బీజేపీ ముఖ్యనేత ఒకరు చెప్పారు. కాంగ్రె్‌సలో పదవిలో ఉన్న నేతలతోపాటు 15 మంది దాకా బీజేపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. గతంలో మంత్రిగా పనిచేసి ప్రస్తుతం టీఆర్‌ఎ్‌సలో ఉన్న నేత కూడా బీజేపీలో చేరే విషయమై కమలం నేతలతో చర్చలు జరిపినట్లు ప్రచారం సాగుతోంది. బీజేపీలో చేరాలని టీటీడీపీలోని ఒక కీలకనేతను బీజేపీ నేతలు పలుమార్లు కోరినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఆ నేత బీజేపీలో చేరితే రానున్న ఎన్నికల్లో దక్షిణ తెలంగాణలో గణనీయమైన సీట్లు సాధించొచ్చని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం.
 
అంతర్గత కలహాలను సహించేదిలేదన్న అధిష్ఠానం ఆదేశాలు తెలంగాణ బీజేపీ నేతలపై ప్రభావం చూపుతున్నాయి. విభేదాలు మాని పార్టీ బలోపేతం కోసం పని చేయాలన్న దిశగా నేతల కదలికలు సాగుతున్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్‌ చేపట్టిన తెలంగాణ విమోచన యాత్ర షెడ్యూల్‌ను బీజేపీఎల్‌పీ నేత కిషన్‌రెడ్డి మీడియాకు విడుదల చేయటం శుభపరిణామంగా ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. 
 
ఓ దశలో పార్టీ నేతలు లక్ష్మణ్‌వర్గం, కిషన్‌రెడ్డివర్గంగా చీలిపోయారన్న అభిప్రాయాలు పార్టీ నే తల్లో వచాయి. పార్టీలోకి ఇతర పార్టీల ప్రముఖులు వలస వచ్చే వేళ అంతర్గత కుమ్ములాటలు వెనుకంజ వేసేట్లు చేస్తున్నాయి. ఈ విషయం అమిత్‌షా దృష్టికి చేరడంతో నేతల మధ్య సఖ్యతను ఏర్పరచాలని లక్ష్మణ్‌ను ఆదేశించింనట్లు తెలుస్తోంది. మీడియాతో మాట్లాడేందుకు రాష్ట్ర కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, అధికార ప్రతినిధులకు లక్ష్మణ్‌ స్వేచ్ఛనిచ్చారు. కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ల ప్రెస్‌మీట్‌ల కంటే ఎక్కువగా ద్వితీయ శ్రేణి నేతల మీడియా సమావేశాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

SHARE