Saturday November 17, 2018
ఫ్లై ఓవర్లపై రాకపోకలు నిషేధం - Tollybeats

ఫ్లై ఓవర్లపై రాకపోకలు నిషేధం

Updated | December 29, 2017 14:12 IST

హైదరాబాద్‌ : డిసెంబర్‌ 31 రాత్రి న్యూ ఇయర్‌ వేడుకల వేళ నిబంధనలు కచ్చితంగా పాటించాలని క్లబ్‌లు, హోటళ్ల యాజమాన్యాలకు, వాహనదారులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

డిసెంబర్‌ 31 రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 3గంటల వరకు రాచకొండ, సైబరాబాద్‌ పరిధిలోని అన్ని ఫ్లై ఓవర్లు, అవుటర్‌ రింగ్‌రోడ్డుపై రాకపోకలు నిషేంధించినట్లు సీపీలు సందీప్‌ శాండిల్య, మహేష్‌ భగవత్‌ తెలిపారు. ఏయిర్‌పోర్టుకు వెళ్లేవారు, తగిన ఆధారాలు ఉన్నవారికి మాత్రమే అవుటర్‌ రింగ్‌రోడ్డుపై ప్రయాణించే వీలుంటుందని పేర్కొన్నారు.

ప్రజలంతా న్యూ ఇయర్‌ వేడుకలను ప్రశాంతంగా జరుపుకొవాలని ఆకాంక్షించారు. గత సంవత్సరం మాదిరిగానే పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు పోలీసుల నిఘాను బలోపేతం చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జీరో యాక్సిడెంట్స్‌తో జీరో డెత్‌డే కోసం కసరత్తు చేస్తున్నామన్నారు

 

SHARE