Saturday November 17, 2018
పాస్ పోర్టు పొందడం ఇంకా సులభతరం..! - Tollybeats

పాస్ పోర్టు పొందడం ఇంకా సులభతరం..!

Updated | December 29, 2017 13:01 IST

పాస్‌పోర్టు పొందడానికి ఇప్పటికే నిబంధనలను సరళతరం చేసిన కేంద్ర ప్రభుత్వం మరింత సరళం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పాస్‌పోర్టు పొందాలంటే జనన ధ్రువీకరణపత్రం లేదా ఎస్‌ఎస్‌సీ మార్కుల జాబితాగాని పొందుపర్చాల్సి ఉండేది. ఇకపై ఎస్‌ఎస్‌సి మార్కుల జాబితాను పొందుపర్చాల్సిన అవసరం లేదు.

పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకునే వారు సమర్పించాల్సిన ధ్రువ పత్రాల విషయంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇటీవల పలు సడలింపులను చేసింది. ఇప్పటి వరకు జనన ధ్రువీకరణకు ఎస్‌ఎస్‌సీ సర్టిఫికెట్‌ లేదా పంచాయతీ లేదా మున్సిపాలటీ ఇచ్చే ధ్రువీకరణ పత్రాలు మాత్రమే చెల్లుబాటు అయ్యేవి. ఇకపై ఆ అవసరం లేదు. ఆధార్‌కార్డు, ఓటరు గుర్తింపు కార్డులలో ఉన్న పుట్టిన తేదీలను పరిగణనలోకి తీసుకుంటారు. భార్యభర్తలు విడాకుల కోసం దరఖాస్తు చేసుకుని పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే విధిగా భాగస్వామి పేరు నమోదు చేయాల్సి వచ్చేది. ఆ నిబంధనను కూడా సడలించారు.

SHARE