Tuesday October 23, 2018
డ్రగ్స్ మత్తులో నేతల పుత్రరత్నాలు - Tollybeats

డ్రగ్స్ మత్తులో నేతల పుత్రరత్నాలు

Updated | July 17, 2017 15:09 IST

హైదరాబాద్ కేంద్రంగా బయటకొస్తున్న డ్రగ్స్ వ్యవహారంలో తాజాగా కొందరు నేతల సంతానం పేర్లు వినిపిస్తున్నాయి. ఏపీ - తెలంగాణలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు - ఎంపీలు - ఎమ్మెల్సీల పిల్లలు కూడా నిండా డ్రగ్స్ మత్తులో కూరుకుపోయినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ వాడకం ఒక్కటే కాకుండా ఈ రాకెట్ నిర్వహణలోనూ కొందరు కీలకంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించి ఎక్సయిజ్ సిట్ విచారణలో కెల్విన్ పలు పేర్లు బయటపెట్టినట్లుతెలుస్తోంది.
    
కెల్విన్ సెల్ ఫోన్ తో పాటు వాట్సప్ గ్రూప్ లలో ఉన్న నెంబర్ల పై ఆరా తీస్తే పలువురు నేతల పుత్రరత్నాల పేర్లు బయటపడినట్లు తెలుస్తోంది. కెల్విన్ సైతం మధ్యవర్తుల ద్వారా తాను రాజకీయ నేతల తనయులకు మత్తు మందును పంపిణీ చేసినట్లు ధృవీక రించాడట. విచారణలో భాగంగా ఆదివారం ఓ న్యాయవాదిని పక్కన కూర్చొబెట్టుకుని ఎక్సైజ్ సిట్ కెల్విన్ ను విచారించిందట. అయితే... ఆ  న్యాయవాది కెల్విన్ చెప్పిన పేర్లు బయటపెడతారేమోనని భావించి ఆ పేర్లు వెల్లడించే సమయంలో న్యాయవాదిని వేరే గదిలో కూర్చొమని అధికారులు చెప్పినట్లు సమాచారం. కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా రాజకీయ నేతల తనయులకు నోటీసులుజారీచేస్తారనితెలుస్తోంది. 
    
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నలుగురైదుగురు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు - ఆయా పార్టీలకు చెందిన జిల్లా పార్టీల అధ్యక్షులు - కార్పోరేషన్ చైర్మన్ల పిల్లలు డ్రగ్స్ బారిన పడినట్లు తెలుస్తోంది. వీరిలో కొంతమంది వీటికి పూర్తిగా బానిసలయ్యారని నగర శివార్లలోని రిసార్ట్స్ లో జరుగుతున్న రేవ్ పార్టీలకు హాజరయ్యే సమయంలో కెల్విన్ బృందం అక్కడకు చేరుకుని మాదక ద్రవ్యాలను అందజేసినట్లు సిట్ విచారణలో వెల్లడైంది. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ - శంషాబాద్ - మేడ్చల్ - శామీర్ పేట్ - ఘట్ కేసర్ ప్రాంతాల్లో ఉన్న రిసార్ట్స్ను ఎంపిక చేసుకుని అక్కడికి వచ్చే రాజకీయ నేతల తనయులను - విద్యార్థులకు ఎరవేసిమత్తుమందునుఅందిస్తున్నట్లుచెబుతున్నారు. 
    
మరోవైపు ఇంతవరకు బయటకు వెల్లడించకపోయినప్పటికీ ఇద్దరు కొత్త హీరోయిన్లు కూడా డ్రగ్స్ కు బానిసయినట్లు వినిపిస్తోంది. ఆర్ తో మొదలయ్యే పేర్లు ఉన్న వీరు తెలుగు ఇండస్ర్టీలోచిరపరిచితులేననిచెప్తున్నారు. 
    
అలాగే... ఏపీకి చెందిన ఓ నేత కుమారుడు ఇటీవల దుర్మరణం పాలైన ఘటన వెనుకా డ్రగ్స్ ప్రభావం ఉందేమోనన్న సందేహాలు వినిపిస్తున్నాయి. అలాగే... సినీరంగంలో కాలుమోపుతున్న కొందరు తెలుగు నేతల వారసులు... గతంలో వివాదాల్లో చిక్కుకున్న ఓ ఏపీ మంత్రి కుమారుడు కూడా డ్రగ్స్ మత్తులో ఉన్నట్లు కెల్విన్ ద్వారా వెల్లడైనట్లు తెలుస్తోంది.
    
కొద్దికాలం కిందట ఏపీలో పార్టీ మారిన దక్షిణ కోస్తాకు చెందిన సీనియర్ లీడర్ ఒకరు కూడా డ్రగ్స్ కంజ్యూమ్ చేస్తారని పొలిటికల్ సర్కిళ్లలో వినిపిస్తోంది.

 

SHARE