Monday July 16, 2018
డ్రగ్స్ కు బానిసైన ఆ టాప్ హీరోయిన్ ఎవరు..? - Tollybeats

డ్రగ్స్ కు బానిసైన ఆ టాప్ హీరోయిన్ ఎవరు..?

Updated | September 7, 2017 09:03 IST

టాలీవుడ్ ను ఉక్కిరిబిక్కిరి చేసిన డ్రగ్స్ వ్యవహారం కొన్నాళ్లుగా తెరమరుగు అయినట్టుగా అగుపిస్తోంది. పట్టుబడిన కొంతమండి డ్రగ్స్ డీలర్లతో సంబంధాలు కలిగిన సినిమా తారలను తెలంగాణ ఎక్సైజ్ శాఖ అధికారులు పిలిపించి మాట్లాడారు. సిట్ కార్యాలయంలో తెలుగు సినీతారల విచారణ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలిచింది.

సినీ ప్రముఖులు సిట్ అధికారుల ముందు హాజరై.. తమ తమ వాంగ్మూలాలను ఇచ్చారు. ఆ తర్వాత క్రమంగా ఆ కేసు మరుగున పడింది.సిట్ విచారణకు హాజరైన సెలబ్రిటీలెవరూ అరెస్టు కాలేదు, అందరూ వారి వారి సినిమాలతో బిజీ అయిపోయారు. దీంతో ఆ వ్యవహారం ఇక తెరమరుగు అయినట్టేనేమో అని అంతా అనుకుంటున్నారు. అయితే ఈ కేసు విచారణను కొనసాగిస్తోందట తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ.

ఈ నేపథ్యంలో.. డ్రగ్స్ బానిసలు అయిన మరో ముగ్గురు సినీతారలను ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించినట్టు సమాచారం. వీరిలో ఒక ప్రముఖ హీరోయిన్ ఉందని, టాప్ హీరోయిన్ అయిన ఆమె విపరీత స్థాయిలో మాదకద్రవ్యాలకు బానిస అయ్యిందని తెలుస్తోంది. మరో ఇద్దరు నటులను కూడా డ్రగ్స్ వినియోగదారులుగా గుర్తించారట.

ఆ హీరోయిన్ విపరీత స్థాయిలో డ్రగ్స్ తీసుకున్నప్పుడు తీసిన వీడియోలు కూడా పోలీసులకు లభించాయని సమాచారం. ఆ హీరోయిన్ ఒక అవార్డ్ ఫంక్షన్లో డ్రగ్స్ తీసుకుని మత్తుతో పడిపోతే.. ఒక నటుడు ఆమెను కార్లో తీసుకుని వెళ్లాడనే విషయం కూడా పోలీసులకు తెలిసిందని సమాచారం. ఇది వరకూ కొంతమంది సినీ నటులను విచారించినప్పుడు.. ఈ ముగ్గురి పేర్లూ ప్రస్తావనకు వచ్చాయట. తాజాగా అందుకు సంబంధించిన ఆధారాలను పోలీసులు సేకరించినట్టుగా తెలుస్తోంది.

 

SHARE