Friday September 21, 2018
ట్రంప్ బెదిరింపు! - Tollybeats

ట్రంప్ బెదిరింపు!

Updated | January 4, 2018 13:07 IST

వాషింగ్టన్‌: తన వద్ద ‘పని చేసే అణ్వాయుధాల మీట’ ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. తన చేతిలో అణ్వాయుధాల మీట ఉందంటూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ చేసిన ప్రకటనకు అంతే ధీటుగా స్పందిస్తూ ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. ‘‘తన టేబుల్‌ మీద అన్ని వేళలా అణ్వాయుధాల మీట ఉంటుందని ఉత్తర కొరియా నాయకుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ చెప్పారు. అన్ని విధాలుగా క్షీణించిన, ఆహారం లేక అలమటిస్తున్న ఆ ప్రభుత్వానికి చెందినవారు ఎవరైనా ఆయనకు చెప్పండి.. నా వద్దా అణ్వాయుధాల మీట ఉందని.. అది ఆయన వద్ద ఉన్నదానికన్నా చాలా పెద్దది, చాలా శక్తివంతమైనదని...నా వద్ద ఉన్న మీట పనిచేస్తుందని చెప్పండ’’ని ట్వీట్‌లో పేర్కొన్నారు. కిమ్‌ జోంగ్‌ ఉత్తర కొరియా ప్రజలకు నూతన సంవత్సర సందేశం ఇస్తూ, విరివిగా అణ్వాయుధాలను తయారు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. తన బల్లపై ఎల్లప్పుడూ అణ్వాయుధాల మీట అందుబాటులో ఉంటుందంటూ అమెరికాను హెచ్చరించారు. దానికి ప్రతిస్పందనగా ట్రంప్‌ ట్వీట్‌ చేశారు.

SHARE