Tuesday July 17, 2018
జై లవకుశ 100 కోట్ల క్లబ్ లో - Tollybeats

జై లవకుశ 100 కోట్ల క్లబ్ లో

Updated | September 27, 2017 13:11 IST

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం చేసిన ‘జై లవకుశ’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లను రాబడుతోంది. గత గురువారం విడుదలైన ఈ చిత్రం మూడు రోజుల్లో రూ.75 కోట్లు రాబట్టింది. ఇక వారం రోజుల్లోనే ఏకంగా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఎన్టీఆర్‌ కెరీర్‌లో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన మూడో చిత్రమిది. ఆయన నటించిన ‘జనతా గ్యారేజ్‌’, ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాలు కూడా వంద కోట్ల క్లబ్‌లో చేరాయి.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత నందమూరి కల్యాణ్‌ రామ్‌ హర్షం వ్యక్తంచేశారు. అభిమానులందరికీ ట్విటర్‌లో ధన్యవాదాలు తెలిపారు. ‘ప్రపంచంలోని తెలుగు చిత్ర అభిమానులు అందరికీ ధన్యవాదాలు’ అని ఆయన సందేశంలో పేర్కొన్నారు.

SHARE