Tuesday July 17, 2018
గెస్ చేస్తే సన్నీ తో సెల్ఫీ - Tollybeats

గెస్ చేస్తే సన్నీ తో సెల్ఫీ

Updated | December 27, 2017 17:39 IST

పోర్న్‌స్టార్ నుంచి బాలీవుడ్ స్టార్‌గా ఎదిగిన స‌న్నీలియోన్‌కు దేశ‌వ్యాప్తంగా సూప‌ర్ క్రేజ ఉంది. ద‌క్షిణాదిలో కూడా ఆమెకు మంచి పాపులారిటీ ఉంది. దాంతో ద‌క్షిణాది చిత్ర ప‌రిశ్ర‌మ‌ల నుంచి కూడా స‌న్నీకి ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా స‌న్నీ ప్ర‌ధాన పాత్ర‌లో తెలుగు, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో ఓ సినిమా తెర‌కెక్కుతోంది.

స్టీఫెన్ నిర్మిస్తున్న ఈ సినిమాను త‌మిళ ద‌ర్శ‌కుడు వ‌డి ఉద‌య‌న్ తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమా కాన్సెప్ట్ పోస్ట‌ర్‌ను బుధ‌వారం విడుద‌ల చేశారు. అయితే టైటిల్ రివీల్ చేయ‌లేదు. టైటిల్‌ను గెస్ చేయండి అంటూ కాంటెస్ట్ పెట్టారు. సినిమా టైటిల్‌లో చివ‌రి ప‌దం `దేవి` అని ప్ర‌క‌టించి.. పూర్తి టైటిల్‌ను గెస్ చేయ‌మ‌ని ప్ర‌క‌ట‌న ఇచ్చారు. స‌రైన టైటిల్‌ను గెస్ చేసిన వారికి సినిమా ప్రారంభోత్స‌వం రోజున స‌న్నీలియోన్‌తో సెల్ఫీ దిగే అవకాశం ఇస్తామని సోషల్ మీడియా ద్వారా చిత్రబృందం తెలిపింది.

SHARE