Friday September 21, 2018
ఖైదీ నంబర్ 150 ను అధికమించిన అజ్ఞాతవాసి - Tollybeats

ఖైదీ నంబర్ 150 ను అధికమించిన అజ్ఞాతవాసి

Updated | January 10, 2018 13:23 IST

అజ్ఞాతవాసి సినిమా మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరింది. యూఎస్ లో రికార్డు స్థాయిలో 570కి పైగా థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. అడ్వాన్స్ బుకింగ్ తోనే ఈ ఘనత సాధించింది. ప్రస్తుతం 481లొకేషన్ల నుంచి అందిన లెక్కల ప్రకారం చూస్తే.. ఈ సినిమాకు 13లక్షల డాలర్లు వచ్చాయి.

ప్రీమియర్స్ ద్వారా ఖైదీ నంబర్ 150సాధించిన రికార్డును అజ్ఞాతవాసి అధిగమించింది. మరికాసేపట్లో బాహుబలి-1రికార్డును కూడా అధిగమిస్తుంది. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండింగ్ బట్టి చూస్తే... ప్రీమియర్ షోల ద్వారా 1.5 మిలియన్ డాలర్లు ఆర్జించే అవకాశం ఉంది.

ఓవర్సీస్ లో హయ్యస్ట్ ప్రీమియర్ వసూళ్లు సాదించిన మొదటి సినిమాగా అజ్ఞాతవాసి నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

SHARE