Tuesday July 17, 2018
కొత్త ఫీచర్లతో శాంసంగ్ మరో కొత్త స్మార్ట్ ఫోన్ - Tollybeats

కొత్త ఫీచర్లతో శాంసంగ్ మరో కొత్త స్మార్ట్ ఫోన్

Updated | January 10, 2018 18:08 IST

న్యూఢిల్లీ: వినియోగదారులకు ఆకర్షించేందుకు మొబైల్ కంపెనీలు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తెస్తున్నాయి.అద్భుతమైన ఫీచర్లతో ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి.ఈ దిశలోనే శాంసంగ్ మొబైల్ కంపెనీ కూడా  కొత్త స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. గెలాక్సీ ఏ8+2018 పేరుతో డ్యూయెల్ ఫ్రంట్ కెమెరా కలిగిన ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో శాంసంగ్ పేతో పాటు, బిక్బ్సీ, డస్ట్, వాటర్ రెసిటెంట్ సదుపాయం కూడా ఉంది.

ఈ నెల 20 నుంచి అమెజాన్ వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ లభిస్తుంది. దీని ధర రూ.32,990‌గా కంపెనీ ప్రకటించింది. ఈ ఫోన్ 18:5:9 రేషియోతో 6 అంగుళాల సూపర్ అమోల్డ్ ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. అంతేకాదు ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఓఎస్‌తో పాటు 1.6 ఆక్టాకోర్ ప్రాసెసర్, 6జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమొరీ కూడా ఉంటుంది. ఇంకా ఈ ఫోన్‌లో 16,8 ఎంపీ డ్యూయల్ ఫ్రంట్ కెమెరాలతో పాటు 16 ఎంపీ బ్యాక్ కెమెరా, 3,500 ఎంహెచ్ బ్యాటరీ కలిగి ఉంటుంది.

SHARE