Sunday January 21, 2018
ఇప్పుడు ట్రంప్ లక్ష్యం ఉత్తర కొరియానా..? - Tollybeats

ఇప్పుడు ట్రంప్ లక్ష్యం ఉత్తర కొరియానా..?

Updated | September 4, 2017 11:04 IST

ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబును పరీక్షించిన తరువాత ప్రపంచ దేశాలు ఆ దేశంపై మండిపడుతున్నాయి.ఉత్తర కొరియా చేసిన పనికి తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని అంటున్నారు.ఉత్తర కొరియాకు మిత్ర దేశంగా ఉన్న చైనా కూడా మండిపడుతుంది.దక్షిణ కొరియా ఉత్తర కొరియాను బుజ్జగించే ప్రయత్నం చేసినా ఫలించలేదు.అటు జపాన్ కు ఉత్తర కొరియాపై చర్యలు తీసుకోవడానికి సిద్దమవుతుంది.  

అయితే, ప్రపంచంలో ఉత్తర కొరియాను ఏకాకిని చేయడమే లక్ష్యం.దీంతో ఆ దేశం కాళ్ళ బేరానికి వస్తుంది.ఒకవేళ అప్పటికి దూకుడు తగ్గించుకోకపోతే.. సైనిక చర్య తీసుకోక తప్పదు.ఇప్పటికే అమెరికాలో ఎక్కడ ఉగ్రవాద చర్యలు జరుగుతాయో అర్ధం కాక భయపడుతున్నారు.జార్జ్ జూనియర్ బుష్ అధికారంలో ఉండగా.. ట్విన్ టవర్స్ పై దాడులు జరిగాయి.కాగా, ఇప్పుడు ఆ పార్టీకి చెందిన ప్రభుత్వం అధికారంలో ఉంది. ట్రంప్ గురించి ప్రపంచ దేశాలకు తెలుసు. ఆయనకు దూకుడు ఎక్కువ.ఇప్పుడు ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.  

 

SHARE