Tuesday October 23, 2018
ఆ టైటిల్ వరుణ్ కు లైఫ్ ఇస్తుందా..? - Tollybeats

ఆ టైటిల్ వరుణ్ కు లైఫ్ ఇస్తుందా..?

Updated | September 7, 2017 09:56 IST

వరుణ్ తేజ్ .. మెగా కాంపౌండ్ హీరో.  మంచి చిత్రాలు చేసినా.. ఎందుకో అవి అంతగా పేరు తెచ్చిపెట్టలేకపోయాయి.ముకుందా పర్వాలేదనిపించింది.ఇక కంచె ఒకే. అయితే, శేఖర్ కమ్ముల తీసిన ఫిదా మాత్రం పిచ్చపిచ్చగా నచ్చింది.వరుణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కావడమే కాకుండా కమర్షియల్ గా మంచి సక్సెస్ కావడంతో వరుణ్ కు క్రజ్ పెరిగింది.  

ఇప్పుడే అసలు కథ మొదలైంది.  ఈ క్రేజీని వరుణ్ ఎలా కాపాడుకుంటాడు.ఫిదా ఫీవర్ ను అలాగే కంటిన్యూ చేస్తూ.. నెక్స్ట్ సినిమా కూడా హిట్ అయితే.. హీరోగా వరుణ్ కు ఢోకా లేదు.ఒకవేళ తేడా వస్తే.. మరలా నిలబడటానికి చాలా సమయం తీసుకుంటుంది.  

ఇక ఇదిలా ఉంటె, ఇప్పుడు వరుణ్ తేజ బాబాయ్ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా తొలిప్రేమపై కన్నేశాడు.అయితే, వరుణ్ ఈ సినిమాను రీమేక్ చేయడంలేదు.. ఈ టైటిల్ ను మాత్రం తీసుకుంటున్నాడట.పవన్ కళ్యాణ్ కెరీర్ ను మలుపుతిప్పిన టైటిల్ తనను కూడా మలుపు తిప్పి హీరోగా మంచి పేరు తెచ్చిపెడుతుందని వరుణ్ ఆశిస్తున్నాడు.  

 

SHARE