Friday April 20, 2018
ఆమె పోటీ చేసినా గెలిచేది నేనే - Tollybeats

ఆమె పోటీ చేసినా గెలిచేది నేనే

Updated | January 10, 2018 17:57 IST

వాషింగ్టన్‌: 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రముఖ అమెరికన్‌ టెలివిజన్‌ హోస్ట్‌ ఓప్రా విన్‌ఫ్రే పోటీ చేయలేదని అంటున్నారు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌. ఇటీవల జరిగిన గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్స్‌ కార్యక్రమంలో ఓప్రా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 2020లో అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేసే అవకాశం ఉందని పరోక్షంగా వెల్లడించారు. ఈ విషయంపై తాజాగా ట్రంప్‌ స్పందించారు.

‘నేను ఓప్రాను ఓడించగలను. నాకు ఆమె బాగా తెలుసు. ఓప్రా అంటే నాకు గౌరవం. ఆమె 2020 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయదని నా అభిప్రాయం. అయినా ఓప్రా లాంటి వ్యక్తితో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడటం చాలా ఫన్నీగా ఉంటుంది. ఓప్రా నిర్వహించే కార్యక్రమాల్లో నేను కూడా పాల్గొన్నాను.’ అని తెలిపారు.

SHARE