Saturday November 17, 2018
అమెరికాలో జై లవకుశ ప్రీమియర్స్ కు రికార్డు స్థాయి కలెక్షన్స్ - Tollybeats

అమెరికాలో జై లవకుశ ప్రీమియర్స్ కు రికార్డు స్థాయి కలెక్షన్స్

Updated | September 21, 2017 17:31 IST

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘జై లవకుశ’ సినిమా అమెరికాలో సూపర్హిట్ టాక్ను సొంతం చేసుకుంది. రాశీఖన్నా, నివేథా థామస్ హీరోయిన్లుగా బాబీ దర్శకత్వంలో, దేవీశ్రీ సంగీతమందించిన ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్లాక్బస్టర్ హిట్ టాక్ వచ్చింది. సినిమాలో మూడు పాత్రల్లో ఎన్టీఆర్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. అమెరికాలో ఈ సినిమాను యూఎస్ తెలుగు మూవీస్ డిస్ట్రిబ్యూట్ చేసింది. మొత్తం 180కి పైగా లొకేషన్లలో ఒకరోజు ముందుగానే ప్రీమియర్ల ద్వారా యూఎస్లో జై లవకుశ సందడి చేసింది.  ప్రీమియర్ షోలకు రికార్డు స్థాయిలో కలెక్షన్లు వచ్చాయని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. 

అమెరికాలో 180కి పైగా స్క్రీన్లలో ప్రీమియర్ల బుధవారం రాత్రి జై లవకుశ సందడి చేసింది. 159 లొకేషన్ల నుంచి అందిన సమాచారం మేరకు ఈ సినిమా 5 లక్షల 25వేల డాలర్లను (3 కోట్ల 39 లక్షల 70వేల రూపాయలు) కలెక్ట్ చేసినట్లు డిస్ట్రిబ్యూటర్లు తెలిపారు. మొత్తంగా ఒక్క ప్రిమియర్ల ద్వారానే హాఫ్ మిలియన్ మార్కు దాటేయడంతో డిస్ట్రిబ్యూటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొదటి రోజు కలెక్షన్లతో ఒక మిలియన్ మార్కు దాటేయడం ఖాయమనీ, హిట్ టాక్ రావడంతో కచ్చితంగా రెండు మిలియన్ డాలర్ల మార్కును సినిమా దాటేస్తుందని తేల్చిచెబుతున్నారు. 

 

 

SHARE