Tuesday October 23, 2018
అంతర్జాతీయ ఉగ్రవాది పై పాక్ సంచలన ప్రకటన - Tollybeats

అంతర్జాతీయ ఉగ్రవాది పై పాక్ సంచలన ప్రకటన

Updated | September 27, 2017 12:06 IST

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఖవాజా అసఫ్ సంచలన ప్రకటన చేశారు. హఫీజ్ సయీద్ తమకు భారమేనని చెప్పారు. హక్కానీ నెట్వర్క్, లష్కరే తొయిబా, హఫీజ్ సయీద్ పాకిస్థాన్కు పెను భారమన్నారు. దీని నుంచి బయటపడటానికి తమకు కాస్త సమయం అవసరమని చెప్పారు. దీని కోసం చేయవలసినది చాలా ఉందన్నారు.

ఈ సందర్భంగా ఆయన అమెరికా పై కూడా మండిపడ్డారు. గతంలో హక్కానీ నెట్వర్క్ను అమెరికా డార్లింగ్ అని భావించిందని, ఇప్పుడు శత్రువుగా చూస్తోందని ఎద్దేవా చేశారు. హక్కానీ నెట్వర్క్ను సృష్టించిన ఘనత అమెరికాదేనన్నారు.

ముంబై దాడుల సూత్రధారి, అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్ లష్కరే తొయిబా, జమాత్ ఉద్ దవా ఉగ్రవాద సంస్థలను స్థాపించాడు. ఆయన ఆచూకీ తెలిపినవారికి 10 మిలియన్ డాలర్ల ప్రోత్సాహకం లభిస్తుంది.

 

SHARE